: వ్యాధులు ప్రబలుతున్నా చర్యలు తీసుకోరే?: అధికారులపై చంద్రబాబు మండిపాటు


నెల్లూరు జిల్లాలో వ్యాధులు ప్రబలుతున్నా చర్యలు తీసుకోవడం లేదంటూ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో డెంగ్యూ తీవ్రతపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పారిశుద్ధ్య లోపం, అంటువ్యాధులపై స్థానిక అధికారులదే బాధ్యత అని ఆయన అన్నారు. అలసత్వం వహించే అధికారులను క్షమించే ప్రసక్తే లేదని, వారిపై చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో ఇన్ చార్జ్ మంత్రులు పనిచేయడం మరిచారని, పెత్తనం చేయకుండా...ప్రజాసేవపై దృష్టి పెట్టాలంటూ చంద్రబాబు మండిపడ్డారు. కరవు నివారణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఆరుతడి పంటలను కాపాడేందుకుగాను రైతులకు రెయిన్ గన్స్ ఇస్తామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News