: బీజేపీ ఓటమితో దేశ ప్రజలు టపాసులు పేలుస్తారు: ఆప్


బీహార్ లో బీజేపీ ఓటమితో దేశ ప్రజలు టపాసులు కాలుస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బీహార్ లో బీజేపీ ఓటమి ఖరారైందని అన్నారు. బీజేపీ ఓటమిపాలవుతుందన్న ఆందోళనతోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విభజన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మత విద్వేషాలు ఎన్డీయే హయాంలో శృతిమించుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే బీహార్లో జరిగిన మూడుదశల ఎన్నికల్లోను బీజేపీ ఓటమి ఖరారైపోవడంతో, మిగిలిన రెండు దశల ఎన్నికల్లోనైనా మతం పేరిట చీలికలు తీసుకొచ్చేందుకు అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఓడిపోయే సమయం ఆసన్నమైందని, ఆ ఓటమితో దేశ ప్రజలంతా మతాబులు కాల్చి పండగ చేసుకుంటారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News