: నిరుపయోగ ప్రభుత్వ భూముల అమ్మకానికి వేలం: టీ సర్కార్ నోటిఫికేషన్
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను టీ సర్కార్ అమ్మకానికి పెట్టనుంది. వేలం ద్వారా ఈ భూములను అమ్మేందుకు తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భూముల వివరాలను కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. వేలం పాటలో పాల్గొనదలచిన వారు 16వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. 13వ తేదీన ప్రీబిడ్ సమావేశం, 17న భూముల వేలం పాట జరుగుతుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో తెలిపింది. వేలం పాటలో పాల్గొనదలచిన వారు 2వ తేదీ నుంచి 12 వరకు ఆ స్థలాలను పరిశీలించుకునే అవకాశం కల్పించింది.