: అమిత్ షాపై ఎన్నికల సంఘానికి సీపీఐ ఫిర్యాదు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఎన్నికల సంఘానికి సీపీఐ పార్టీ ఫిర్యాదు చేసింది. తూర్పు చంపారన్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ, బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే పాకిస్థాన్ లో టపాసులు పేలుస్తారని అన్నారని ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా తదితరులు జాతీయ ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. కాగా, అమిత్ షా చేసిన వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ట్వీట్ చేయడం విశేషం.