: మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్ పై ఫిర్యాదు
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ పై హైదరాబాద్ లోని మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ లో అభినవ్ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు. మారేడ్ పల్లికి చెందిన భువన అనే యువతి, అదే ప్రాంతానికి చెందిన అభినవ్ లు మేలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి యువతి తండ్రికి ఇష్టం లేదు. దాంతో వారిద్దరినీ విడదీయాలంటూ యువతి తండ్రి తలసాని కుమారుడు సాయికిరణ్ ను కోరాడు. ఈ నేపథ్యంలో తన అనుచరులతో అభినవ్ పై మంత్రి కొడుకు దాడి చేయించాడు. అదే సమయంలో తన భార్య భువనను వారు బలవంతంగా ఎత్తుకెళ్లారని, ఇప్పటికీ మంత్రి కుమారుడి అధీనంలోనే ఆమె ఉందని తన ఫిర్యాదులో అభినవ్ పేర్కొన్నాడు.