: భవిష్యత్తులో ఈ-కామర్స్ మార్కెట్ చైనాదే!


ఈ-కామర్స్ రంగం విజృంభించడంతో వ్యాపార రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. వినియోగ దారుల నుంచి ఈ=కామర్స్ రంగానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ రంగంలో ఇంత వరకు నెంబర్ వన్ గా నిలిచిన అమెరికా భవిష్యత్తులో వెనకబడుతుందని, అగ్రస్థానంలోకి చైనా దూసుకువస్తోందని అమెరికా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ తెలిపింది. చైనా ఇంటర్నెట్ నెట్ వర్క్ ఇన్ఫర్మేషన్ సెంటర్ తెలిపిన వివరాల ఆధారంగా ఈ విషయం స్పష్టమైనట్టు గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. 2014లో చైనాలో ఈ-కామర్స్ లావాదేవీలు 439 మిలియన్ డాలర్లుగా నమోదు కాగా, అమెరికా ఈ- కామర్స్ లావాదేవీలు 290 బిలియన్ డాలర్లని తెలిపింది. ఈ గణాంకాల ఆధారంగా అమెరికా కంటే చైనా ఈ కామర్స్ వృద్ది రేటు గణనీయంగా ఉందని, భవిష్యత్తులో అమెరికాను చైనా అధిగమిస్తుందని గ్లోబల్ టైమ్స్ తెలిపింది.

  • Loading...

More Telugu News