: రూ.27,000 దిగువకు పుత్తడి


ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. పుత్తడి ధర రూ.27,000 కన్నా తక్కువకు పడిపోయింది. రూ.245 తగ్గడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.26,830కి చేరింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,145.50 అమెరికన్ డాలర్లు. కాగా, వెండి ధర రూ.37,000 దిగువకు చేరుకుంది. రూ.735 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.36,630కి చేరింది. నగల వ్యాపారులు కొనుగోళ్లు చేయకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర తగ్గినట్లు మార్కెట్ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News