: మూడు రాష్ట్రాలపై ప్రభావం చూపనున్న 'చపల'
అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడింది. దీనికి 'చపల' అని పేరు పెట్టారు. ఇది బంగ్లాదేశ్ పెట్టిన పేరు. ముంబై తీరానికి 11 వందల కిలోమీటర్ల దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రానున్న 48 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావంతో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో తీర ప్రాంత ప్రజలను కేంద్రం అప్రమత్తం చేసింది.