: పాక్, చైనాలు మోదీని చూసి భయపడుతున్నాయి: సుశీల్ కుమార్ మోదీ
బీహార్ లో బీజేపీ ఓడితే పాకిస్థాన్ లో టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటారంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన సంచలన వ్యాఖ్యలు మరువక ముందే, ఆ రాష్ట్ర నేత సుశీల్ కుమార్ మోదీ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనా, పాక్ లు మోదీని చూసి భయపడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి మోదీని బలహీనపరచవద్దని బీహార్ ప్రజలకు విన్నవించుకున్నారు. బీహార్ ప్రజలు తప్పనిసరిగా బీజేపీకి ఓటు వేసి ప్రధాని మోదీని బలపరచాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. అలాగే, బీహార్ లో బీజేపీ గెలిస్తే భారత్ లో సంబరాలు చేసుకుంటారని, అదే యూపీఏ గెలిస్తే పాక్ లో సంబరాలు చేసుకుంటారన్న అమిత్ షా వ్యాఖ్యల్ని కూడా సుశీల్ కుమార్ మోదీ ట్వీట్ చేశారు.