: వైసీపీ నేత కొడుకు పెళ్లిలో ‘ఈనాడు’ రామోజీరావు... చిరంజీవి, బాలకృష్ణ కూడా!


వైసీపీ కీలక నేత, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి వివాహం మౌనిషా రెడ్డితో నిన్న రాత్రి హైదరాబాదులో వేడుకగా జరిగింది. నగరంలోని ఫిల్మ్ నగర్ విస్పర్ వ్యాలీలో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకకు వైసీపీ కీలక నేతలంతా హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు ‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కూడా హాజరయ్యారు. తన కుమారుడి పెళ్లికి రావాలని గతంలో కరుణాకరరెడ్డి స్వయంగా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీ రావును ఆహ్వానించిన సంగతి తెలిసిందే. నాడు కరుణాకరరెడ్డిని తీసుకుని వైఎస్ జగన్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. వీరి ఆహ్వానాన్ని మన్నించిన రామోజీరావు నిన్నటి పెళ్లికి హాజరయ్యారు. ఇక ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ ప్రముఖ నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి, మరో అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, ప్రజా గాయకుడు గద్దర్ తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News