: బాకీ చెల్లించలేదని మహిళను వివస్త్రను చేయబోయాడు...శంషాబాదులో వడ్డీ వ్యాపారి దుర్మార్గం


హైదరాబాదు పాతబస్తీలోని వడ్డీ వ్యాపారులు క్రూరులు. అయితే రంగారెడ్డి జిల్లా శంషాబాదులోని వ్యాపారుల ఆగడాల ముందు వీరు బలాదూరే. ఎందుకంటే, బాకీ చెల్లించలేదన్న కారణంతో శంషాబాదుకు చెందిన వడ్డీ వ్యాపారి బండారి శ్రీనివాస్ ఓ మహిళను నడి బజారులో వివస్త్రను చేసేందుకు యత్నించాడు. శంషాబాదులోని బస్టాండ్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. వడ్డీ వ్యాపారి ఘాతుకంతో షాక్ తిన్న బాధితురాలు పరుగు పరుగున సమీపంలోని ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనను తాను కాపాడుకుంది. ఆ తర్వాత వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ కంప్లైంట్ నేపథ్యంలో శ్రీనివాస్ అక్కడి నుంచి చిన్నగా జారుకున్నాడు. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు శ్రీనివాస్ కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News