: ‘ఓరుగల్లు’ ఉప బరి అభ్యర్థి ఖర్చంతా పార్టీదే: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన


వరంగల్ ఉప ఎన్నికల్లో వేడి రాజుకుంది. నిన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేకంగా భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థి సింగిల్ పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థి ఖర్చు మొత్తం పార్టీనే భరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విపక్షాలపై ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికల బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఖర్చు పెట్టే వారు ఎవరూ ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు డబ్బు పెట్టేటోళ్లు లేరు, భుజాన వేసుకునేవారు అసలే లేరంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే టీడీపీ అడ్రెస్ గల్లంతైందన్నారు. బీజేపీకి కేడర్ లేదని, అసలు ఆ పార్టీకి అభ్యర్థి కూడా దొరకడం లేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమని కూడా కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News