: వినూత్న మార్గాల్లో బంగారం అక్రమరవాణా


బంగారం అక్రమ రవాణాకు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. టూత్ పేస్ట్ లో బంగారాన్ని దాచిపెట్టి అక్రమంగా తరలిస్తున్న సంఘటన ఒకటి కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. ఈ విధంగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కేరళకు చెందిన హనీఫ్, బషీర్ లు దుబాయ్ నుంచి మంగళూరు విమానాశ్రయానికి వచ్చారు. లగేజీ చెకింగ్ సమయంలో అనుమానాస్పద వస్తువులున్నట్లుగా తేలింది. దీంతో వారి లగేజీని తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. టూత్ పేస్ట్, షాంపూ, ఫేస్ క్రీం బాటిళ్లలో పౌడర్ రూపంలో బంగారాన్ని దాచారు. ఆ వస్తువులను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News