: డిసెంబర్ 13న రోహిత్ శర్మ వివాహం


టీమిండియాలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నేడు హర్భజన్ ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రోహిత్, కోహ్లీ వివాహంపై టీమిండియా క్రికెటర్లలో చర్చ రేగింది. డిసెంబర్ 13న ప్రముఖ ఆటగాడు రోహిత్ శర్మ తన ప్రేయసి రితికను వివాహం చేసుకోనున్నాడు. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న రోహిత్ శర్మ, భార్యతో కలిసి నివసించేందుకు ముంబైలోని బాంద్రాలో 30 కోట్ల రూపాయలతో ఓ ఇల్లు కూడా కొనుగోలు చేశాడు. డిసెంబర్ 13న ఓ స్టార్ హోటల్ లో వివాహం చేసుకున్న అనంతరం వారి మకాం కొత్తింటికి మారనుంది. కాగా, తెలుగు మూలాలు కలిగిన రోహిత్ శర్మ ఏ సంప్రదాయంలో వివాహం చేసుకుంటాడో అనే ఆసక్తి అందర్లోనూ నెలకొంది. కాగా, ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది మొదట్లో కానీ వివాహం చేసుకోవాలని కోహ్లీ భావిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News