: ఇంద్రాణికి డెంగ్యూ లేదన్న వైద్యులు


కన్న కూతురు షీనా బోరాను హత్య చేసిందన్న ఆరోపణలతో కటకటాలు లెక్కపెడుతున్న ఇంద్రాణి ముఖర్జియా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. బైకుల్ల మహిళా జైల్లో ఉన్న ఆమె గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమెకు రక్తపరీక్షలు నిర్వహించగా బ్లడ్ ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నాయని తేలింది. మరోవైపు ఆమెకు డెంగ్యూ సోకిందని భావించారు. దీంతో, నిన్న ఆమెను జేజే ఆసుపత్రికి తరలించారు. ఈరోజు మరోసారి ఆమెకు రక్త పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ లేదని నిర్ధారణ అయింది. ప్టేట్ లెట్స్ మాత్రం తక్కువగా ఉన్నాయని తేలింది. మరోసారి ఇంద్రాణిని పరీక్షించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు తెలిపారు.

  • Loading...

More Telugu News