: స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎదురుచూస్తున్న 'వన్ ప్లస్ ఎక్స్' వచ్చేసింది!


చైనా కేంద్రంగా భారత్ లో స్మార్ట్ ఫోన్లను మార్కెటింగ్ చేస్తున్న 'వన్ ప్లస్' సరికొత్త మొబైల్ వన్ ప్లస్ ఎక్స్ మార్కెట్లోకి విడుదలైంది. దీని ధర రూ. 16,999 అని సంస్థ వెల్లడించింది. సరికొత్త ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆధారంగా నడిచే ఆక్సిజన్ ఓఎస్, 5 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, 1080/1920 క్వాలిటీ రెజల్యూషన్, 2.3 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 గిగాబైట్ల అంతర్గత సామర్థ్యం, 13/8 ఎంపీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ తదితర సదుపాయాలు ఈ ఫోన్లో ఉన్నాయి. వన్ ప్లస్ ఎక్స్ ను గురించి సంస్థ ప్రకటించినప్పటి నుంచి స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News