: మా లాభాల రహస్యం ఇదే: ఇండిగో చీఫ్ ఆదిత్య ఘోష్
ఇండిగో సంస్థ గత ఏడేళ్లుగా లాభాల బాటలో పయనిస్తోంది. ఈ సందర్భంగా ఇండిగో ప్రెసిడెంట్, డైరైక్టర్ ఆదిత్య ఘోష్ మాట్లాడుతూ, తమ సంస్థ లాభాలు ఆర్జించడం వెనుక రహస్యాన్ని ఆయన చెప్పారు. ‘మా వ్యాపారానికి సంబంధించిన ప్రతి చిన్న అంశంపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. సమయపాలన, విమానాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్రయాణికులకు మంచి ఆహారంతో పాటు సేవలను మా సర్వీసుల్లో అందిస్తాం. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కేవలం ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టి విజయపథంలో నడుస్తున్నాము. ఇంధన ఖర్చు, నిర్వహణా వ్యయం, ఎయిర్ క్రాఫ్ట్ ఓనర్ షిప్ కాస్ట్, మొదలైన ఖర్చులు... మొదలైనవి తగ్గించుకోవడం ద్వారా ఇండిగోను లాభాల బాటలో నడిపిస్తున్నాము’ అని ఆదిత్య ఘోష్ చెప్పారు.