: ప్రపంచకప్ వరకు ధోనీనే ఉండాలి: సెహ్వాగ్
వచ్చే ప్రపంచ కప్ వరకు లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ కెప్టెన్ గా ధోనీనే కొనసాగించాలని డ్యాషింగ్ బ్యాట్స్ మెన్, తాజా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. ధోనీ లేకపోతే బ్యాటింగ్ ఆర్డర్ లో 6, 7 స్థానాలు బలహీనమవుతాయని చెప్పాడు. అదే జరిగితే, సరైన ఫినిషింగ్ లేదనే అభిప్రాయానికి క్రికెట్ అభిమానులు వస్తారని, దాంతో మ్యాచ్ పై ఆసక్తి తగ్గుతుందని అభిప్రాయపడ్డాడు. అందువల్ల ధోనీనే కెప్టెన్ గా కొనసాగించాలని... దీంతో, ప్రపంచకప్ నాటికి టీమిండియా బలోపేతం అవుతుందని సెహ్వాగ్ చెప్పాడు. ధోనీ రిటైర్ మెంట్ గురించి ఆలోచిస్తే మాత్రం, టీమ్ చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నాడు. తన రిటైర్ మెంట్ కు ధోనీనే కారణమనే వార్తలను కొట్టిపారేసిన సెహ్వాగ్... ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని తెలిపాడు. తన వీడ్కోలుకు, ధోనీకి సంబంధం లేదని స్పష్టం చేశాడు.