: ఏ ఐటీ సంస్థా అంచనాలకు తగ్గట్టుగా లేదు: నాస్కామ్


2016 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలోని ఏ ప్రముఖ ఐటీ సంస్థ కూడా అంచనాలకు మించిన వృద్ధి లక్ష్యాలను సాధించే పరిస్థితుల్లో లేదని నాస్కామ్ అభిప్రాయపడింది. ఈ సంవత్సరం ఐటీ కంపెనీలు 12 నుంచి 14 శాతం వరకూ వృద్ధి లక్ష్యాలను అంచనా వేయగా, ఇండియాలోని టాప్-4 కంపెనీలు లక్ష్యాలను అందుకోలేకపోవచ్చని వెల్లడించింది. ఇతర ఐటీ కంపెనీలకు ఇది ముందస్తు హెచ్చరికని తెలిపింది. ఈ కంపెనీల మూడవ త్రైమాసికం ఫలితాలు అత్యంత కీలకమని, ఈ త్రైమాసికంలో భవిష్యత్ ఆదాయ, వ్యయాల అంచనా కీలకమని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత్ గుప్తా వెల్లడించారు. చైనా స్టాక్ మార్కెట్ క్రాష్, ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గడం వంటి కారణాలతోనూ ఐటి కంపెనీలు మందగమనంలో సాగుతున్నాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News