: ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం నుంచి 8 మంది మంత్రుల తొలగింపు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారే ఎనిమిది మంది మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. వారిలో ఐదుగురు కేబినెట్ మంత్రులు, ముగ్గురు సహాయ మంత్రులు ఉన్నారు. ఆ మంత్రుల పనితీరు సక్రమంగా లేనందునే అఖిలేశ్ వారిపై వేటు వేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో వారి స్థానంలో కొత్తగా ఎనిమిది మందిని కేబినెట్ లోకి తీసుకోనున్నారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే మంత్రులను తొలగించారని కొందరు అంటుంటే, మరోవైపు తన పాలనపై స్వయంగా తన తండ్రి, ఎస్పీ అధినేత ములాయం సింగ్ విమర్శలు చేయడంవలనే అఖిలేష్ ఇలా చేశారని మరికొందరు అంటున్నారు.