: ఆఫ్రికాకు భారీ నగదు సాయం ప్రకటించిన మోదీ
భారత్-ఆఫ్రికా ముగింపు సదస్సులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆఫ్రికాకు భారీ నగదు సాయాన్ని ప్రకటించారు. సదస్సులో మోదీ ప్రసంగిస్తూ, ఆఫ్రికా దేశాల అభివృద్ధికి మరింత సాయం అందిస్తామని అన్నారు. ఈ మేరకు 600 మిలియన్ డాలర్ల సాయం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఐదు సంవత్సరాల్లో ఆఫ్రికాకు 10 మిలియన్ డాలర్ల రాయితీ రుణం అందిస్తామని తెలిపారు. ఆఫ్రికా వ్యవసాయ రంగంలో ప్రంపచ ఆహార భద్రతకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆఫ్రికాలో డిజిటల్ సాంకేతికత అభివృద్ధికి అంతరిక్ష పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు.