: ఇండో-ఆఫ్రికన్ సదస్సు... ఆరంభం అదుర్స్!


ప్రతిష్ఠాత్మక ఇండో-ఆఫ్రికన్ సదస్సు ముగింపు వేడుకలు వీవీఐపీలు, ఆహూతుల సమక్షంలో అబ్బుర పరిచే సాంస్కృతిక కార్యక్రమాల నడుమ వైభవంగా మొదలయ్యాయి. ఆఫ్రికాలోని వివిధ దేశాలు, ఇండియాకు చెందిన సుమారు 200 మంది కళాకారులు తమ అద్భుత నృత్య పాటవాన్ని ప్రదర్శించారు. గణపతి పూజ, ఆపై సంప్రదాయ ఆఫ్రికన్ ధ్యానం, యోగాను గుర్తు చేస్తూ నృత్య రూపకం, కథాకళి, ఆఫ్రికన్ డ్రమ్ డ్యాన్స్ తదితరాలకు సభికుల నుంచి మంచి స్పందన వచ్చింది. 50 అడుగులకు పైగా పొడవైన వేదిక వెనుకభాగంలో భారీ ఎల్ఈడీ తెరలు, లేజర్ లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. 'అదుర్స్' అనిపించేలా సదస్సు ప్రారంభం కాగా, ప్రస్తుతం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరికాసేపట్లో సదస్సు ముగింపు కార్యక్రమం ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News