: నవంబర్ 2న ఏపీ కేబినెట్ భేటీ... అమరావతి నిర్మాణంపైనే ప్రధాన చర్చ


ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి నవంబర్ 2న భేటీ కానుంది. విజయవాడలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంపైనే ప్రధాన చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన చంద్రబాబు సర్కారు త్వరలోనే నిర్మాణ పనులను మొదలుపెట్టనుంది. దీనికి సంబంధించి కాంట్రాక్టరు ఎంపిక, పనుల అప్పగింత, తొలుత చేపట్టాల్సిన నిర్మాణాలు తదితరాలపై కేబినెట్ సమగ్రంగా చర్చించనుంది. ఇక విశాఖ మెట్రో నిర్మాణం, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితరాలపైనా కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News