: లష్కరే తోయిబా ఆపరేషనల్ కమాండర్ హతం... కుల్గామ్ లో మట్టుబెట్టిన భారత సైన్యం
పాకిస్థాన్ భూభాగం కేంద్రంగా భారత్ లో అల్లకల్లోలమే ప్రధాన లక్ష్యంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆపరేషనల్ కమాండర్ అబూ ఖాసిం హతమయ్యాడు. భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఆ కరుడుగట్టిన ఉగ్రవాది ఖతమయ్యాడు. జమ్మూ కాశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో అతడు చనిపోయాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించడంతోనే సైన్యం కాల్పులు జరిపిందని, ఈ కాల్పుల్లో ఏకంగా లష్కరే ఆపరేషనల్ కమాండర్ హతమయ్యాడని తెలుస్తోంది. అబూ ఖాసిం హతంతో లష్కరే తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. ఇప్పటికే పలువురు కీలక నేతలను కోల్పోయిన ఆ సంస్థ అబూ ఖాసిం హతంతో మరింత బలహీనపడే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.