: సెహ్వాగ్ కు వీడ్కోలు సన్మానం...బీసీసీఐ నిర్ణయం
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు ఘనంగా వీడ్కోలు పలకాలని బీసీసీఐ నిర్ణయించింది. డిసెంబర్ 3న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే నాలుగో టెస్టు మ్యాచ్ సమయంలో సెహ్వాగ్ ను సత్కరించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. అయితే, దీనిపై ఇంతవరకు తమకు ఎలాంటి సమాచారం లేదని ఢిల్లీ క్రికెట్ సంఘం తెలిపింది.