: భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తున్నాం: ప్రత్తిపాటి


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు కేంద్రంగా 31,359 ఎకరాలను భూసమీకరణ ద్వారా సేకరించామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, రాజధాని పరిధిలో అటవీ, అసైన్డ్ భూములను వదిలేసి మరో 1500 ఎకరాలు సేకరించాల్సి ఉందని అన్నారు. ఈ భూమి మొత్తం తుళ్లూరులో గల 300 కుటుంబాలకు సంబంధించినదని ఆయన తెలిపారు. అది మినహా రాజధాని పరిధిలో 98 నుంచి 99 శాతం భూమిని సేకరించామని అన్నారు. మిగిలిన 1500 ఎకరాల భూమిని సేకరించేందుకు భూసేకరణ చట్టాన్ని ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. రానున్న పది రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన చెప్పారు. కాగా, గతంలో ఓసారి భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం దానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News