: బీహార్ లో అసదుద్దీన్ ఒవైసీ అరెస్టు


ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని బీహార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ ఎన్నికల ప్రచార సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో పూర్ణియా జిల్లా పోలీసు అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. కాగా, బీహార్ లో మూడో దశ ఎన్నికలు నేడు జరుగుతుండగా, నాలుగోదశ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వివిధపార్టీల నేతలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

  • Loading...

More Telugu News