: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనూహ్య హంతకుడికి ఉరిశిక్ష విధించండి!: పబ్లిక్ ప్రాసిక్యూటర్
2014 జనవరి 5న ముంబై రైల్వే స్టేషన్ లో అదృశ్యమైన మచిలీపట్నానికి చెందిన యువతి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనూహ్య ఎస్తేర్ హత్యకేసులో కారు డ్రైవర్ చంద్రభాన్ ను దోషిగా న్యాయస్థానం నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రభాన్ కు విధించాల్సిన శిక్షపై పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిఫెన్స్ లాయర్ తమ వాదనలు వినిపించారు. తెల్లవారుజామున ఒంటరిగా వెళ్తున్న యువతిని గమ్యం చేరుస్తానని చెప్పి, అత్యంత కిరాతకంగా హత్య చేసిన దోషికి ఉరిశిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలంగా వాదించారు. న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 30కి వాయిదా వేశారు. కాగా, అనూహ్య కుటుంబ సభ్యులు చంద్రభాన్ కు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.