: మహాకూటమిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రధాని స్థాయి వ్యక్తికి తగదు: లాలు
మహాకూటమి అధికారంలోకి వస్తే భవిష్యత్తులో రిజర్వేషన్లు ప్రమాదకరస్థితిలో పడతాయని ప్రధాని మోదీ విమర్శించడాన్ని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఖండించారు. మతాలపరంగా రిజర్వేషన్లు కల్పిస్తారంటూ ప్రధానిగా ఉన్న వ్యక్తి వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. బీహార్ అసెంబ్లీకి జరుగుతున్న మూడో విడత ఎన్నికల్లో ఓటు వేసిన తరువాత లాలు మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల అంశంపై మోదీ మతాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీలకు ఇవ్వాల్సిన 5 శాతం రిజర్వేషన్ వారికి దూరం చేసి, ఇతర మతాల వారికి ఇస్తారని మోదీ అనడంపై మండిపడ్డారు. దళితులు, ఓబీసీల రిజర్వేషన్లను దేశంలో ఎవరూ తొలగించలేరన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏను షాక్ కు గురి చేస్తాయని హెచ్చరించారు.