: వరంగల్ లో చతుర్ముఖ పోటీ... బరిలోకి దిగుతామన్న వైసీపీ టీ చీఫ్ పొంగులేటి


వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ముక్కోణపు పోటీ తప్పదన్న భావన పటాపంచలైంది. ఈ ఎన్నికలో తన అభ్యర్థిని బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించిన వైసీపీ చతుర్ముఖ పోటీకి తెరలేపింది. ఈ మేరకు హైదరాబాదులోని లోటస్ పాండ్ లో కొద్దిసేపటి క్రితం పార్టీ నేతలతో భేటీ అయిన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. అప్పట్లో దివంగత సీఎం వైెఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో సింహభాగం వరంగల్ జిల్లా ప్రజలకే అందాయన్నారు. ఈ కారణంగా వైఎస్ ఇంకా వరంగల్ ప్రజల మది నుంచి చెరిగిపోలేదని చెప్పారు. ఇటీవల పార్టీ నేత వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్రకు వెల్లువెత్తిన అభిమానమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఉప బరిలో నిలిచే అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News