: కుటుంబాన్ని బంగారుమయం చేసుకున్నారు... 'ట్రీట్ మెంట్' ఇవ్వాల్సిందే!: కిషన్ రెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, టీఆర్ఎస్ ప్రభుత్వంపైన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఉద్యమాల పునాదులపై పార్టీని నిర్మించానని, తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పుకుంటున్న కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే బంగారుమయం చేసుకున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో పాలన పూర్తిగా గాడి తప్పిందని ఆరోపించారు. ఏ ఒక్క హామీని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. పాలకపక్షం ప్రజాసమస్యలను గాలికి వదిలేసిందని అన్నారు. ప్రభుత్వానికి సరైన ట్రీట్ మెంట్ ఇవ్వడానికి ఇదే సరైన సమయమని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News