: నేడు కూడా వర్షాలు పడొచ్చు!
రాష్ట్రాన్ని క్యూములో నింబస్ మేఘాలు కమ్మేశాయి. దాంతో నేడు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి కర్ణాటక వైపుగా కొనసాగుతోందని చెప్పారు. ఈ ప్రభావంతో ఈ రాత్రి కోస్తాంధ్రాలో కొన్నిచోట్ల అధికంగా, మరికొన్ని చోట్ల స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.