: గ్రేటర్ పరిధిలో మీ ఓటు ఉందా? లేదా?... తెలుసుకోండిలా!


ఓ వైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోవైపు లక్షల ఓట్లను తొలగించారనే వార్తలు గుబులు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అసలు మన ఓటు ఉందా? లేక తొలగించారా? అనే సందేహం జీహెచ్ఎంసీ పరిధిలోని ఓటర్లందరికీ కలుగుతోంది. అయితే, ఓటర్ లిస్టులో మీ ఓటు ఉందా? లేదా? అనే విషయం తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పిస్తోంది. నవంబర్ 1న జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రచార దినోత్సవం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మీరు మీ సమీపంలోని పోలింగ్ బూత్ కు వెళ్లి మీ ఓటు వివరాలను తెలుసుకోవచ్చు. అంతేకాదు, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, సవరణలు, అడ్రస్ మార్పు, ఫొటోలను మార్చుకునే అవకాశం కూడా ఉంది. హైదరాబాదులోని 15 నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారు. నవంబర్ 4వ తేదీ వరకు ఈ సదుపాయం ఉంటుంది.

  • Loading...

More Telugu News