: బరిలో లాలూ పుత్రరత్నాలు... బీహార్ లో మొదలైన మూడో విడత పోలింగ్


దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలోని 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ గట్టి బందోబస్తు మధ్య కొనసాగుతోంది. బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ లు బరిలో నిలిచిన నియోజకవర్గాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీరిద్దరితో పాటు ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న 50 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 808 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు.

  • Loading...

More Telugu News