: ప్రణబ్ తో భేటీ కానున్న కేసీఆర్... రాజ్ నాథ్, జవదేకర్ లతో కూడా!
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటన నిమిత్తం కేసీఆర్ మొన్న రాత్రికే ఢిల్లీ చేరుకున్నారు. నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన ఆయన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి వివరించారు. నేటి పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, ప్రకాశ్ జవదేకర్ లతో భేటీ కానున్నారు. తాను నిర్వహించనున్న ఆయుత చండీయాగానికి రావాల్సిందిగా ప్రణబ్ ను కేసీఆర్ ఆహ్వానిస్తారు. ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై కేంద్ర మంత్రులతో కేసీఆర్ చర్చించనున్నట్లు సమాచారం.