: వరంగల్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ నేడే!


వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికకు నేడు తెర లేవనుంది. ఈ ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. నేడు విడుదల కానున్న నోటిఫికేషన్ ప్రకారం వచ్చే నెల 4 లోగా అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. దాఖలైన నామినేషన్ల పరిశీలన వచ్చే నెల 5న జరగనుంది. 7వ తేదీలోగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. అదే రోజు బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఇక ఈ ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ను వచ్చే నెల 21న నిర్వహించనున్నారు. ఆ తర్వాత మూడు రోజులకు (24వ తేదీ) ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

  • Loading...

More Telugu News