: మెదడు ఆపరేషన్ ప్రత్యక్షప్రసారం... అమెరికా వైద్యుల ఘనత
పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న అమెరికాకు చెందిన వ్యక్తికి అక్కడి వైద్యులు మెదడుకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సర్జరీని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో ప్రత్యక్షప్రసారం చేశారు. యూనివర్సిటీ హాస్పిటల్స్ కేస్ మెడికల్ సెంటర్ కు చెందిన అమెరికా వైద్యులు 49ఏళ్ల గ్రెగ్ గ్రిండ్లే అనే వ్యక్తికి మెదడుకు శస్త్రచికిత్స నిర్వహించారు. మెదడులోకి ఎలక్ట్రోడ్స్ పంపించి ఈ శస్త్రచికిత్స చేయడంతో గ్రిండ్లే రెండు చేతుల్లో వణుకుడు తగ్గింది. శరీరం నియంత్రణలో ఉండటంతో పాటు భాషాపరమైన విషయాల్లో మార్పులు కనిపించాయని వైద్యులు తెలిపారు.