: ఆంధ్రా రాజధానికి ఉద్యోగుల తరలింపుపై సర్క్యులర్ జారీ


హైదరాబాద్ నుంచి నవ్యాంధ్ర తాత్కాలిక రాజధాని విజయవాడకు ఉద్యోగుల తరలింపుపై సాధారణ పరిపాలనా శాఖ ఈ రోజు సర్క్యులర్ జారీ చేసింది. నవంబర్, ఫిబ్రవరి, జూన్ మాసాల్లో మూడు విడతల్లో ఉద్యోగులను తరలించేందుకు గాను వారి నుంచి ఐచ్ఛికత కోరింది. ఉద్యోగులు ఐచ్ఛికతను తెలిపే నిమిత్తం ఒక నమూనాను ఏపీ సర్కార్ విడుదల చేసింది. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు ఏపీ సీఎస్ కృష్ణారావును కలిశారు. విజయవాడకు తరలి వెళ్లేందుకు తాము వ్యతిరేకం కాదని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. సచివాలయం మెుత్తాన్ని ఒకే యూనిట్ గా చూడాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. కేవలం సాధారణ పరిపాలనా శాఖ ఉద్యోగులకే సర్క్యులర్ పరిమితం చేయకుండా, ఉద్యోగులందరి నుంచి ఒకేసారి ఐచ్ఛికత పత్రాలను తీసుకోవాలని విన్నవించారు.

  • Loading...

More Telugu News