: అవన్నీ పుకార్లు...క్లారిటీ ఇచ్చిన 'అఖిల్'
'అఖిల్' సినిమాలో కొన్ని సీన్లను రీషూట్ చేస్తున్నారని, అందుకే విడుదల ఆలస్యం అవుతోందని గత కొంత కాలంగా ఫిల్మ్ నగర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటిపై సినిమా నటుడు అఖిల్ అక్కినేని ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చాడు. గత కొంత కాలంగా 'అఖిల్' సినిమాపై ఫిల్మ్ నగర్ లో షికార్లు చేస్తున్నవన్నీ పుకార్లేనని స్పష్టం చేశాడు. సినిమాలో సన్నివేశాలన్నీ నిఖార్సుగా చిత్రీకరించామని, రీషూట్ చేయడం లేదని తెలిపాడు. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. అంత్యదశ పనులు వేగంగా జరుగుతున్నాయని, సినిమాను వీలైనంత త్వరలో అభిమానుల ముందుకు తీసుకువస్తామని అఖిల్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.