: సెహ్వాగ్ కు సాదర స్వాగతం పలికిన సచిన్


వీరేంద్ర సెహ్వాగ్ కు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సాదరస్వాగతం పలికాడు. వెటరన్ క్రికెటర్లలో సచిన్, వార్న్ కెప్టెన్లుగా 'రిటైర్డ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ టీట్వంటీ మ్యాచ్'లు అమెరికాలో జరగనున్న సంగతి తెలిసిందే. అమెరికాలో క్రికెట్ కు ఆదరణ తేవడంతో పాటు, ఆటకు దూరమై వ్యాపారాల్లో మునిగిపోయిన క్రికెటర్ల మూలాలు మరోసారి గుర్తు చేసేందుకు సచిన్ ఈ టోర్నీ నిర్వహిస్తున్నాడు. వినోదానికి వినోదం, వ్యాపారానికి వ్యాపారంగా ఈ సిరీస్ సాగనుంది. ఈ సిరీస్ లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన దిగ్గజ ఆటగాళ్లు పాలుపంచుకోనున్నారు. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన సెహ్వాగ్ కూడా వారితో చేరాడు. దీంతో సెహ్వాగ్ కు సచిన్ స్వాగతం పలికాడు. ఈ సందర్భంగా చేసిన ట్వీట్ కు వారిద్దరూ కలిసి ఆడినప్పటి ఫోటోను జతచేశాడు. ఇది అభిమానులను అలరిస్తోంది.

  • Loading...

More Telugu News