: హార్దిక్ పటేల్ తో ఫోటో కోసం ముచ్చట పడ్డారు ... సస్పెండ్ అయ్యారు!


పాటీదార్ అనామత్ ఆందోళన నేత హార్దిక్ పటేల్ కు గడ్డుకాలం నడుస్తోంది. సరిగ్గా నెల రోజుల్లో హార్దిక్ పటేల్ హవా తగ్గిపోయింది. సోషల్ మీడియాలో హీరోగా ఎదిగిన హార్దిక్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలతో గుజరాత్ లో ఆందోళనలకు కారణమయ్యాడు. ప్రభుత్వంపై వివిధ మార్గాల్లో పోరాటం ప్రారంభించాడు. నేరుగా కేంద్ర ప్రభుత్వానికే అల్టిమేటం జారీ చేశాడు. అంతటితో ఆగకుండా 'పోలీసులను హత్య చేయండి' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో హార్దిక్ పటేల్ ను గుజరాత్ పోలీసులు అక్టోబర్ 13న అరెస్టు చేశారు. హార్దిక్ పటేల్ పోలీసు కస్టడీలో ఉండగా అతడితో ఒక కానిస్టేబుల్ మహేంద్రసింగ్ ఫోటో తీసుకున్నాడు. వారిద్దరి ఫోటోను హెడ్ కానిస్టేబుల్ అరుణ్ దాలే తీశారు. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు వారిద్దరినీ సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News