: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు


దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూల పవనాలు లేకపోవడంతో ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 108 పాయింట్లు కోల్పోయి 27,253కు పడిపోయింది. నిఫ్టీ 27 పాయింట్లు పతనమై 8,233కు చేరుకుంది. ఈనాటి టాప్ గెయినర్స్ లో బీఫ్ యుటిలిటీస్ లిమిటెడ్ (19.50%), టీవీఎస్ మోటార్స్ (13.15%), ఫినొలెక్స్ ఇండస్ట్రీస్ ( 5.91%), ఎన్ఐఐటీ టెక్నాలజీస్ (4.99%), కాక్స్ అండ్ కింగ్స్ (4.71%)లు ఉన్నాయి. టాప్ లూజర్స్ లో లుపిన్ లిమిటెడ్ (-5.25%), శ్రీ సిమెంట్ (-4.18%), ఓఎన్జీసీ (-3.07%), హెచ్ డీఎఫ్ సీ (-2.87%), జీఎస్ఎఫ్సీ (-2.79%)లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News