: తోటపల్లి రిజర్వాయర్ రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్రంలోని తోటపల్లి రిజర్వాయర్ ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో తోటపల్లి రిజర్వాయర్ కు చెందిన 6,7,8,10,11,12 ప్యాకేజీ పనుల్లో మార్పులను హైపవర్ కమిటీ ప్రతిపాదించింది. ఈ మార్పును అంగీకరిస్తున్నట్టు నీటిపారుదల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.