: భన్వర్ లాల్, సోమేష్ కుమార్ టీఆర్ఎస్ ఏజెంట్లు: ఇంద్రసేనారెడ్డి
రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ లపై బీజేపీ నేతలు మండిపడ్డారు. వీరిద్దరూ టీఆర్ఎస్ ఏజెంట్లుగా మారారని, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. గ్రేటర్ పరిధిలో బీజేపీ, టీడీపీలకు పట్టున్న ప్రాంతంలో ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ఒక్క కూకట్ పల్లిలోనే 1.90 లక్షల ఓట్లు తొలగించారని తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారితో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఓట్ల తొలగింపుపై సీఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.