: తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెంచం: మంత్రి మహేందర్ రెడ్డి


తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచే ఉద్దేశం లేదని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. త్వరలో అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రముఖ పుణ్య క్షేత్రాలకు ఏసీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కొత్తగా ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేయడం లేదని, ఉన్న డిపోలనే మరింత మెరుగు పరుస్తామని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News