: నితీష్ కు అసలు సిగ్గే లేదా?: మోదీ


బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఈ ఐదేళ్ల పరిపాలనలో ఒక్క హామీని కూడా నితీష్ నెరవేర్చలేకపోయారని ఈ రోజు సీతామఢిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన విమర్శించారు. లోక్ సభ ఎన్నికల సమయంలో బీహార్ కు రూ. 50 వేల కోట్ల ప్యాకేజీ ఇస్తానని చెప్పానని... కానీ, రూ. లక్షా 65 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చానని మోదీ తెలిపారు. విద్యుత్ ఇవ్వకపోతే 2015లో ఓట్లు అడగడానికి రానని గత ఎన్నికల సమయంలో నితీష్ హామీ ఇచ్చారని... కానీ, ఆ మాటను నితీష్ నిలబెట్టుకోలేదని మండిపడ్డ మోదీ... అసలు నితీష్ కు సిగ్గన్నదే లేదా? అని ప్రశ్నించారు. మహాకూటమి ఒక అవకాశవాద కూటమి అని, దీని వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News