: గీత భవిష్యత్ బాగుండాలి: కేజ్రీవాల్ ఆకాంక్ష


15 ఏళ్ల క్రితం సంఝౌతా ఎక్స్ ప్రెస్ ఎక్కి పాకిస్థాన్ వెళ్లిపోయి ఈధి ఫౌండేషన్ లో ఆశ్రయం పొంది, తిరిగొచ్చిన గీత భవిష్యత్ బాగుండాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆకాంక్షించారు. ఢిల్లీలో ఈధి ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి గీత కేజ్రీవాల్ ను కలిసింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ సైగల ద్వారా గీతతో సంభాషించారు. గీత చురుకైన అమ్మాయని, ఆమె భవిష్యత్ బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, గీత తల్లిదండ్రులపై ఉత్కంఠ వీడేందుకు డీఎన్ఏ పరీక్ష ఫలితాల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  • Loading...

More Telugu News