: అమరావతి మాది కాదు... అందుకే దూరంగా ఉన్నాం: మైసూరారెడ్డి


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో తమకు సంబంధం లేదని, అందుకే ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా తాము పట్టించుకోవడం లేదని వైకాపా సీనియర్ నేత మైసూరారెడ్డి అన్నారు. కేవలం రియలెస్టేట్ మాఫియాను ప్రోత్సహించేందుకే అమరావతిని నిర్మిస్తున్నారని విమర్శించారు. అమరావతిలో సామాన్యుడు నివసించే పరిస్థితి లేదని మండిపడ్డారు. రాయలసీమ ప్రజలకు అమరావతి రాజధాని కావడం ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారు. రాజధాని ప్రాంత రైతులపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు.

  • Loading...

More Telugu News