: ఎఫ్ఆర్ బీఎం పరిధి పెంచాలని జైట్లీని కేసీఆర్ కోరారు: తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి
తమ ప్రభుత్వ విజ్ఞప్తులను మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తెచ్చినట్టు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు. జైట్లీతో సమావేశం అనంతరం వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఎఫ్ఆర్ బీఎం పరిధిని పెంచాలని సీఎం కేసీఆర్ కోరినట్టు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా జైట్లీకి వివరించామన్నారు. మిషన్ కాకతీయ పథకానికి నిధులు, వాటర్ గ్రిడ్ పథకానికి అదనపు నిధులు ఇవ్వాలని సీఎం కోరినట్టు వివరించారు. అంతేగాక హెచ్ఎండీఏకు ఆదాయపన్ను మినహాయించాలని కూడా కోరినట్టు తెలిపారు. ఇదే సమయంలో కరవు మండలాల గురించి జైట్లీకి వివరించామన్నారు. అంతకుముందు అరుణ్ జైట్లీ ఢిల్లీలో మాట్లాడుతూ, నిధుల పెంపు, పన్ను మినహాయింపుల గురించి కేసీఆర్ చర్చించారన్నారు.