: వరంగల్ ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలుస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి


వరంగల్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నిక విజయంపై టి.కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఈ ఎన్నికలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందుతామని స్పష్టంగా చెప్పారు. ఈ మేరకు వరంగల్ లో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలే తమ ప్రచార అస్త్రాలని అన్నారు. ఐదుగురు అభ్యర్థుల పేర్లతో పార్టీ అధిష్ఠానం వద్దకు వెళుతున్నామని తెలిపారు. అయితే వివేక్ వైపే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News